టాలీవుడ్‌లో విభిన్న చిత్రాలు చేస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యువ కథానాయకుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) . కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్స్ అందుకున్న ఈ యువ హీరో గత కొంతకాలంగా ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఆయన నటించిన చివరి సినిమా ‘లైలా’ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ప్రస్తుతం ఫంకీ (Funky) సినిమానే ఆశలు పెట్టుకోగా.. ఈ మూవీ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ సినిమాకు ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్ (Anudeep) దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రయూనిట్ కత్తెర పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమా నిడివి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫంకీ సినిమాకు క్రిస్పీ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2 గంటల 08 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రదర్శితం కానుందట. నిజానికి ఇది సినిమాకు చాలా కలిసొచ్చే అంశమే. ఎందుకంటే అదనంగా షోలు ప్లాన్ చేసుకునేందుకు అలాగే త్వరగా షోలు పూర్తి చేసుకుని ప్రేక్షకులు ఇంటికి వెళ్లిపోయేందుకు ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా కామెడీ సినిమాలకు నిడివి తక్కువగా ఉంటేనే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా ఆస్వాదించగలరని, అందుకే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘ఫంకీ’ (Funky) చిత్రాన్ని ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైనమెంట్స్ (Sithara Entertainments) , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

