ఫ్యాన్స్‌కు పవర్ ప్యాక్డ్ గిఫ్ట్.. కొత్త సినిమా ముహూర్తం ఫిక్స్!

by | Feb 5, 2026 | సినిమా

టాలీవుడ్ లో దర్శకుడిగా సురేందర్ రెడ్డికి (Surendar Reddy) ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. అతనొక్కడే సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఊస‌ర‌వెల్లి, అతిథి, కిక్-2 లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత సురేందర్‌ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 32వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న‌ అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం.. ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి మొదటి వారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది కలగకుండా తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో పవన్‌ కళ్యాణ్ ను ఇంతకుముందు చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఈ చిత్రానికి పవర్ ప్యాక్డ్ స్క్రిప్ట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి (Ram Talluri) ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ అప్‌డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహం పెరిగిందని చెప్పవచ్చు.