ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడుగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటీనటుల విషయానికి వస్తే, అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) నటిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ వ్యయంతో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ‘AA22 x A6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, దీనిపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో నటించే కథానాయికల గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ జాబితాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) , రష్మిక మందన (Rashmima Mandana) పేర్లు వినిపించగా తాజాగా రష్మిక మందన ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరుగుతున్న షెడ్యూల్లో రష్మిక పాల్గొంటోందని ఈ షెడ్యూల్ లో, అల్లు అర్జున్ (Allu Arjun) తో పాటుగా రష్మిక, జాన్వీ కపూర్, జిమ్ సర్భ్ల మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లుగా సమాచారం. ఈ షెడ్యూల్ నాలుగు వారాల పాటు కొనసాగనుండగా ఇందులో ఎమోషనల్ సీన్స్ తో పాటుగా యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, పుష్ప ఫ్రాంచైజీలో అల్లు అర్జున్ (Allu Arjun) , రష్మిక మందన్నా (Rashmika Mandana) జోడీ సూపర్ హిట్ కావడంతో ఈ క్రేజీ కాంబో మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది.

