రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు విజయం ; మళ్ళీ ఓడిన Delhi

by | Feb 5, 2026 | వార్తలు

Women Premiere League Final లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

 మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

ఢిల్లీ కాపిటల్ ఓపెనర్లు షెఫాలీ వర్మ, లీ లు మొదటి వికెట్ కు 49 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 13 బంతుల్లో 20 పరుగులు, లీ 30 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 

ఆ తరవాత వచ్చిన లారా వోల్వర్ట్, కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి మూడవ వికెట్ కు 76 పరుగులు జోడించారు. జెమిమా 37 బంతుల్లో 57 పరుగులు చేసి అవుట్ అయ్యింది.

లారా వోల్వర్ట్ తో జత కలిసిన హెన్రి నాలుగవ వికెట్ కు 55 పరుగులు జోడించారు.  లారా వోల్వర్ట్ 25 బంతుల్లో 44 పరుగులు చేసి ఆఖరి బంతికి రన్ అవుట్ అయ్యింది. హెన్రి 15 బంతుల్లో 25 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచింది

అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.  9 పరుగులు చేసిన గ్రేస్ హరీష్ రెండవ ఓవర్లో అవుట్ అయ్యింది.

అయితే ఆ తరవాత వచ్చిన జార్జియా వోల్ మరో ఓపెనర్, కెప్టెన్ స్మ్రితి మందన లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.  వీరిద్దరూ రెండవ వికెట్ కు 165 పరుగులు జోడించారు.  జార్జియా వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసి అవుట్ అవగా  స్మ్రితి మందన 41 బంతుల్లో 87 పరుగులు చేసి హెన్రి బౌలింగ్ లో అవుట్ అయ్యింది.  రాధా యాదవ్, క్లర్క్ లు లాంఛనాన్ని పూర్తి చేశారు

నాలుగవ సారి ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఓడిపోయింది.