రామ్ చరణ్ హీరో గా వచ్చిన పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. సినిమా విడుదలైన రెండవ వారంలో కూడా బుక్ మై షో లో టికెట్స్ సేల్ లో పెద్ది గాడు అదరగొడుతున్నాడు. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పెద్ది ఇప్పటిదాకా 378 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు వృద్ధి సినిమాస్ వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఈ సినిమాని చూసిన మెగా స్టార్ చిరంజీవి గారు కూడా పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు ని, నిర్మాత వెంకట సతీష్ కిలారు ని ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలిపారు
నేటి యువతరానికి సందేశాన్ని ఎలా ఇస్తే అర్ధం అవుతుందో బుచ్చిబాబు కు బాగా తెలిసింది. స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని క్రికెట్, కుస్తీ, పరుగు తో మేళవించి చెప్పిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది
ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు విమర్శకులనుండి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా కర్ణాటక, హిందీ లో కూడా మంచి వసూళ్లను సాధించిందని తెలుస్తోంది.
ఏమైనా కె జి ఎఫ్, పుష్ప వంటి క్రిమినల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లతో కాకుండా ఒక సందేశాత్మక చిత్రాన్ని చేయాలనీ రామ్ చరణ్ ప్రయోగం ఫలించిందని చెప్పవచ్చు

