‘కింగ్​డమ్​’ క్రేజీ అప్‌డేట్‌.. శ్రీలంకకి విజయ్ దేవరకొండ

by | Mar 24, 2025 | సినిమా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయట. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నారు.
ఇటీవల ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే తాజాగా ‘కింగ్ డమ్’ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలోని లవ్ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ (Vijay Devara Konda) పాస్‌పోర్ట్ ప‌ట్టుకుని ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ కోసం ఎదురుచూస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. మరోసారి శ్రీలంకకు బయల్దేరామని రాసుకొచ్చాడు. అయితే శ్రీలంకలోని కొన్ని స్పెషల్ లొకేషన్స్ లో ఐదు రోజుల పాటు ఈ లవ్ సాంగ్ ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా.. అణచివేతకు గురైన తన జాతి ప్రజలను రక్షించుకోవడానికి శ్రీలంక సైన్యాన్ని ఎదురించే తిరుగుబాటు నాయకుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ‘కింగ్​డమ్​'(Kingdom) సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం ఈ ఏడాది మే 30న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.