చిరు – అనిల్ మూవీ షూటింగ్‌ ఎప్పుడంటే.?

by | Mar 24, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తాజా చిత్రం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్‌ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు చిరు ప్రకటించారు. ఈ సినిమాను షైన్‌ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల నానితో ‘ది పారడైజ్‌’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే చిరంజీవితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ పూర్తవగానే చిరు, అనిల్‌ రావిపూడి సినిమా సెట్స్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రారంభించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీ కామెడీ అండ్ మాస్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనుండగా.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభంపై త్వరలోనే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. కాగా, చిరంజీవి హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ త‌ర‌హాలో ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించాలని భావిన్నాడ‌ట‌. ఈ క్రమంలొనే కామెడీతో పాటుగా ఎమోషన్స్ మిక్స్ చేసి అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక యాక్షన్‌ సీన్స్‌ కూడా ఓ రేంజ్‌లోనే ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన అదితి రావు హైదరీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.