ఎఫైర్ నిజమేనా?ఎలక్షన్స్ ముందే విజయ్‌కి బ్యాడ్ టైమ్!

by | Feb 28, 2026 | రాజకీయాలు

కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే హాట్ టాపిక్. అదే దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం! ఒకప్పుడు వీరాభిమానిగా పరిచయమై.. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగీత.. ఇప్పుడు ఆయనకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆదర్శ జంటగా పేరుతెచ్చుకున్న వీరు విడాకుల దాకా ఎందుకు వెళ్లారు? దీని వెనుక ఉన్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఇది కేవలం కుటుంబ కలహమా? లేక రాజకీయ కుట్ర దాగుందా? ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. త కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవని, సంగీత ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఒంటరిగా ఉంటున్నారని వస్తున్న వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధాలే అని సంగీత వర్గం వాదిస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో విజయ్‌కు ఒకరిద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆయనతో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్.. ఏకంగా విజయ్ ఉంటున్న ఏరియాలోనే ఇల్లు కొనుక్కోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న సంగీత తీవ్ర మనస్తాపానికి గురయ్యారని సమాచారం.

విజయ్ స్టార్ హీరోగా ఉన్నంత కాలం ఎవరూ మాట్లాడలేదు. కానీ ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే.. ప్రత్యర్థులు ఆయన్ని టార్గెట్ చేశారు. రీసెంట్‌గా ఒక బీజేపీ ఎంపీ.. స్టార్ హీరోయిన్ త్రిషతో విజయ్‌కు లింక్ పెడుతూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయో మనకు తెలుసు. త్రిష స్వయంగా ఒక ఓపెన్ లెటర్ ద్వారా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక విజయ్ ఎదుర్కొంటున్న మరో షాక్.. ఆయన కొడుకు జాసన్ సంజయ్. గత కొంతకాలంగా తండ్రితో సంజయ్ ఏమాత్రం టచ్‌లో లేడని వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ కొడుకు అయ్యుండి కూడా, తండ్రి పేరు వాడుకోకుండా.. తండ్రి సపోర్ట్ లేకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు సంజయ్. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో సినిమా చేస్తున్నాడు. కొడుకు ఇలా అంటిముట్టనట్లుగా దూరంగా ఉండటం, తండ్రి నీడ నుంచి బయటపడాలనుకోవడం.. ఇంట్లో జరుగుతున్న కలహాలకు అద్దం పడుతోందా.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఐదేళ్లుగా నరకం చూస్తున్నానని చెప్పిన సంగీత.. సరిగ్గా ఎన్నికలకు ముందే ఇలా ఓపెన్ అవ్వడం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? విజయ్ పొలిటికల్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రత్యర్థులు ఈ విడాకుల అంశాన్ని వాడుకుంటున్నారా..

ఒకసారి గమనించండి.. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. 2025 సెప్టెంబరు 27న కరూర్‌లో జరిగిన తమిళగ వెట్రి కళగం పార్టీ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన ‘జన నాయగన్’ సినిమాను అడ్డుకున్నారు. ఇప్పుడేమో భార్య విడాకులు! ఇవన్నీ కాకతాళీయంగా జరుగుతున్నాయా? లేక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయా.. మొత్తానికి రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన స్థానం కోసం పోరాడుతున్న దళపతి విజయ్‌కు.. సొంత కుటుంబ పరిణామాలు పెద్ద బ్రేక్ వేస్తున్నాయి. భార్య విడాకులు కోరడం, కొడుకు దూరంగా ఉండటం ప్రత్యర్థులకు పదునైన అస్త్రాలుగా మారాయి. మరి ఈ సంచలన ఆరోపణలు, డ్యామేజ్ నుంచి దళపతి విజయ్ తన పొలిటికల్ కెరీర్‌ను ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.