తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత.. వీళ్లంతా ఒకే మాట మీద ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయింది! ‘మైడియర్ బ్రదర్’ అంటూ కవిత నేరుగా కేటీఆర్ మీద యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్ ఓటమికి కవితే కారణమా? అసలు ఆనాడు జైలుకు వెళ్తే సొంత అన్న తమ్ముళ్లు ఎందుకు పట్టించుకోలేదు? కవిత కొత్త పార్టీ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ వివాదం ఎక్కడ మొదలైంది? కేటీఆర్ చేసిన ఒక ట్వీట్.. పార్టీ ఓటమికి లిక్కర్ కేసు కూడా ఒక కారణమని అర్థం వచ్చేలా మాట్లాడటం కవితను తీవ్రంగా గాయపరిచింది. ‘నా మీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా?’ అని ఆమె అడిగిన ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. పార్టీ కోసం జైలుకు వెళ్తే, ఇప్పుడు ఓటమిని నా మెడకు చుడతారా అని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. కవిత జైల్లో ఉన్న ఐదున్నర నెలలు.. ఆమె పడిన నరకం అంతా ఇంతా కాదు. ఆ సమయంలో కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు? ‘నాడు నేను ఒంటరిగా పోరాడాను’ అని కవిత చెబుతుంటే, అది కేవలం రాజకీయ విమర్శ కాదు.. ఒక చెల్లెలి ఆవేదన. బీజేపీ వాళ్లు బతుకమ్మ ప్లేస్‌లో లిక్కర్ బాటిళ్లు పెట్టి ట్రోల్ చేస్తుంటే, బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఎక్కడికి పోయింది? ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు..
ఇక అసలు బాంబు.. కవిత కొత్త పార్టీ! రెండు నెలల్లో కొత్త పార్టీ పెడతానని ఆమె ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్. దేవుడి ఆశీర్వాదం, ప్రకృతి సహకారం వల్లే ఈ తీర్పు వచ్చిందని ఆమె నమ్ముతున్నారు. దోపిడీదారులకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పినా వినలేదని, అందుకే పార్టీ ఓడిపోయిందని ఆమె బాహాటంగానే విమర్శించారు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆడబిడ్డ అని చూడకుండా అడ్డగోలుగా మాట్లాడిన సోషల్ మీడియా ‘పెయిడ్ బ్యాచ్’కు కవిత గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘అడ్డగాడిదల్లా ప్రవర్తించిన వారికి తగిన సమయంలో సమాధానం చెబుతా’ అని హెచ్చరించారు. ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత వీక్ పార్టీనా బీఆర్ఎస్? తెలంగాణ సాధించిన పార్టీకి అంత సీన్ లేదా అని ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉంది.. సోషల్ మీడియాలో ‘పెయిడ్ బ్యాచ్’ గురించి కవిత గారు మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. సొంత పార్టీ నాయకురాలిని, అది కూడా కేసీఆర్ గారి కూతుర్ని.. అడ్డమైన పేర్లతో పిలుస్తూ ట్రోల్ చేస్తున్నారంటే ఆ బ్యాచ్ వెనుక ఉన్నది ఎవరు?
అడ్డగాడిదల్లా ప్రవర్తించిన వారికి తగిన సమయంలో సమాధానం చెబుతా’ అని ఆమె హెచ్చరించారంటే.. ఆ సమాధానమే ఈ ‘కొత్త పార్టీ’నా? బీఆర్ఎస్ ఐటీ వింగ్ ను, దాన్ని నడిపిస్తున్న వారిని ఆమె టార్గెట్ చేశారన్నది బహిరంగ రహస్యం. రెండు నెలల్లో కొత్త పార్టీ! ఇది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం. కవిత తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటికే గ్రామ గ్రామాన క్యాడర్ ను కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆ క్యాడర్ అంతా కొత్త పార్టీ జెండా కిందకు రాబోతోంది. ఇది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీలుస్తుందా? లేక కాంగ్రెస్, బీజేపీలకు సవాల్ విసురుతుందా? ప్రకృతి సహకరించింది, దేవుడు ఆశీర్వదించాడు అని ఆమె అనడం వెనుక తన రాజకీయ భవిష్యత్తుపై ఆమెకు ఉన్న నమ్మకం కనిపిస్తోంది. మరి కేసీఆర్ గారు ఎటు వైపు ఉంటారు? కొడుకు వైపా? కూతురు వైపా? లేక ఇదంతా కలిసి ఆడుతున్న నాటకమా? ఏది ఏమైనా.. రాబోయే రెండు నెలలు తెలంగాణ పాలిటిక్స్ అగ్నిపర్వతంలా ఉండబోతున్నాయి.

