విజయ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా. ‘కింగ్డమ్’ భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కాగా, యూఎస్ మార్కెట్ లో కింగ్డమ్ సినిమాకు రిలీజ్ కు ముందే మంచి బిజినెస్ అవుతున్నట్లు తెలుస్తోంది. యూఎస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ డాలర్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ గత రెండు సినిమాలు లైగర్, ది ఫ్యామిలీ స్టార్ వంటి భారీ ప్లాప్స్ వచ్చిన తర్వాత కూడా కింగ్డమ్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం అంటే రౌడీ హీరో క్రేజ్ ఎలాంటిదో తెలుస్తోంది. కాగా, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోకి ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ టీజర్ అద్భుతంగా కట్ చేయడంతో పాటు అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

