టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా 100 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. నాగ చైతన్య కెరీర్‌లో ‘తండేల్’ సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. ..
కాగా, ‘తండేల్’ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనూ పాటల్నే వాడుకున్నారు దేవిశ్రీప్రసాద్. ఈ క్రమంలోనే ‘తండేల్’ మూవీలోని ‘బుజ్జి తల్లి’ అనే సాంగ్ ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మైలురాయిని అందుకుంది. దింతో యూత్ ఆడియన్స్ ను బుజ్జితల్లి సాంగ్ ఏ రేంజ్ లో అలరించిందో తెలుస్తోంది.
ఇక బుజ్జితల్లి సాంగ్ సాధించిన ఘనత గురించి నిర్మాణ సంస్థ పేర్కొంటూ.. మా బుజ్జి తల్లి సాంగ్ ను ఆదరించిన అభిమానులకి ధన్యవాదాలు. ఈ సాంగ్ ను బిగ్ స్క్రీన్ పై ఆస్వాదించండి అని పేర్కొంది. కాగా, బుజ్జితల్లి సాంగ్ కు శ్రీమణి సాహిత్యం అందించగా.. జావేద్ అలీ పాడారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే.

