టావీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన లేెటెస్ట్ మూవీ ‘తండేల్’. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ఆదరగొడుతోంది. ఇప్పటికే 70 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టిన ఈ సినిమా రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది.
తాజాగా ‘తండేల్’ సినిమా రూ.95 కోట్ల మైలురాయిని దాటినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. కాగా, ‘తండేల్’ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని చేరుకొని నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ గా నిలిచింది. ప్రస్తుతం ‘తండేల్’ జోరు చూస్తుంటే ఈ శనివారం, ఆదివారం ముగిసేసరికి బాక్సాఫీస్ వసూళ్లు మరింత పెరిగే ఆవకాశముంది. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ నిర్మించారు.

