స్టార్ మా నెంబర్ వన్ తెలుగు ఛానల్

by | Feb 15, 2025 | టీవీ & ఓటిటి

టెలివిజన్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకు పోతోంది స్టార్ మా.  విభిన్న కథలతో, సీరియల్స్ ద్వారా కుటుంబ ప్రేక్షకులకు చేరువైన స్టార్ మా శని, ఆది వారాలు నాన్ ఫిక్షన్ షో లతో అదరకొడుతోంది.  అంతే కాకుండా ఇండస్ట్రీ హిట్ చిత్రాలు అయిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, పుష్ప వంటి చిత్రాలు కూడా స్టార్ మా లోనే ప్రసారమయ్యాయి.  అంతేకాకుండా లేటెస్ట్ పాన్ ఇండియా హిట్ పుష్ప-2 కూడా త్వరలో స్టార్ మా లో ప్రసారమవబోతోంది

అంతే కాకుండా పండగలకు ప్రసారమయ్యే ఈవెంట్ లతో కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎనిమిది సీజన్లుగా స్టార్ మా బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంది.  కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని, తారక్, మెగా స్టార్ చిరంజీవి లాంటి నటులను యాంకర్లుగా మార్చిన ఘనత స్టార్ మా ఛానల్ కు దక్కుతుంది

కార్తీక దీపం సీజన్-2 ని కూడా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు.  అంతే కాకుండా గుండెనిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు, చిన్ని సీరియల్స్ కు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బ్రహ్మరహమ్ పడుతున్నారు 

ఆదివారం అంటే స్టార్ మా, స్టార్ మా అంటే ఆదివారం సందడి అనేలా ఆదివారం విత్ స్టార్ మా పరివారం తో ఆదివారం మధ్యాన్నం, ఇస్మార్ట్ జోడి  తో ఆదివారం సాయంత్రం తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.  అందుకే ఆదివారం విత్ స్టార్ మా పరివారం, ఇస్మార్ట్ జోడి షో లు నెంబర్ వన్ తెలుగు నాన్ ఫిక్షన్ షో లు గా రాణిస్తున్నాయి