మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘విశ్వంభ‌ర’ నుంచి సర్​ప్రైజ్​

by | Feb 15, 2025 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యుంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్​తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్​ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ అప్ డేట్ ను మేకర్స్ అందించారు.

ఈ సినిమా తాజా షెడ్యూల్ లో ఒక పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ ని మెగాస్టార్ చిరంజీవి మీద కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట‌కు శోభి మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నారు. దీని గురించి నిర్మాణ సంస్థ తెలియజేస్తూ.. ఫ్యాన్స్ అందరూ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కోసం రెడీగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. ఈ పాటలో మెగాస్టార్ త‌న డాన్స్‌ గ్రెస్ తో మరోసారి దుమ్మురేపనుండగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీర‌వాణి అందించ‌బోతున్న మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిల‌వ‌బోతుందని అంటున్నారు. అలాగే తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన చేసిన ‘విశ్వంభ‌ర’ పోస్టర్ లో కళ్ళజోడు, గడ్డంతో మాస్ లుక్ లో చిరు ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కాగా, ‘విశ్వంభర’ సినిమాలో త్రిష, అషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనుండగా.. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.