వెంకీ – అనిల్ కాంబో.. ఆ స్టార్ హీరో కీలక పాత్రలో?

by | Feb 18, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తో తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ హిట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది. దాంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా వెంకటేష్‌ (Venkatesh) తో సినిమా చేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మళ్ళీ 2027 సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘శ్రీమతి లలితా రెడ్డి’ (Srimathi Lalitha Reddy) అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. కథానాయికలుగా పూజా హెగ్దే (Pooja Hegde) , కీర్తి సురేష్ (Keerthy Suresh) ఎంపికైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమా కోసం కూడా స్టార్స్ ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథలో వెంకీ బావమరిది పాత్ర కీలకంగా ఉండనుండగా.. ఆ పాత్ర కోసం బలమైన నటుడిని ఎంపిక చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. ఆ పాత్రలో కొన్నిరోజుల నుంచి మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. కానీ, ఇప్పుడు ఆ స్థానంలో కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) నటిస్తోన్నట్లు సమాచారం. ఇది కేవలం గెస్ట్ రోల్ తరహాలో కాకుండా, ఫుల్ లెంగ్త్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ అని టాక్. వెంకీ – కార్తీ స్క్రీన్ షేర్ చేస్తారన్న ఈ వార్త తెలుగు ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించిన కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు వెంకీతో కలిసి నటిస్తే అది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఇప్పటికే వెంకటేష్ (Venkatesh) , అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వస్తోన్న ఈ నాలుగో సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో కార్తీ కూడా భాగం అవుతుండడంతో మరింత ఆసక్తి నెలకొంది.