T20 World Cup : భారత జట్టు లో పవర్ హిట్టర్ గా పేరు పొందిన అభిషేక్ శర్మ ఈ T20 World Cup లో పరుగుల ఖాతా తెరవడానికి ఆపసోపాలు పడుతున్నాడు.
ఐసీసీ టి 20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ నెంబర్ వన్, కానీ గత ఏడు ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ ఐదు సార్లు డక్ అవుట్ అయ్యాడు. ఏడు ఇన్నింగ్స్ లలో ఒక అర్ధ సెంచరీ ఉంది.
అభిషేక్ శర్మ టి 20 కెరీర్ లో ఇలా ఇన్ని మ్యాచ్ లలో డక్ అవడం ఈ సీజన్లోనే. మొదటి బంతి నుంచి ధాటిగా ఆడాలన్న ఆలోచనే అభిషేక్ శర్మ ను డక్ అవుట్ అయ్యేలా చేస్తోందా… లేదా బౌలర్లు అభిషేక్ శర్మ వీక్ పాయింట్ ను కనిపెట్టి ఫీల్డ్ సెట్టింగ్ చేస్తున్నారా
మరో పక్క ఇషాన్ కిషన్ చెలరేగి పోతున్నాడు. అదే పిచ్ ల మీద అభిషేక్ శర్మ డక్ అవుట్ అవుతున్నాడు. ఈ ప్రపంచ కప్ లో ఈ రోజు నెదర్లాండ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో కూడా డక్ అవుట్ అయ్యాడు. అంతకు ముందు యూ ఎస్ ఎ తో జరిగిన మ్యాచ్ లో మరియు పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా డక్ అవుట్ అయ్యాడు
సూపర్ 8 మ్యాచ్ లకు సిద్ధమవుతున్న భారత జట్టుకు అభిషేక్ శర్మ ఫామ్ భారత జట్టు ను కలవర పెడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో సూపర్ 8 మ్యాచ్ లు స్టార్ట్ అవుతాయి. కోచ్ గౌతమ్ గంభీర్ ఒక సారి అభిషేక్ శర్మ మాట్లాడాలి

