వరుణ్ తేజ్ 15 వ సినిమా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో వస్తున్నట్లు తెలుపుతు యూ వి క్రియేషన్స్ వీడియో విడుదల చేసింది
ఈ సారి మనం తీసుకోబోయే రూట్ ఎక్స్ ప్రెస్ రూట్ అని వరుణ్ తేజ్ సత్య తో ఒక మంచి ఫన్నీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మధ్యలో దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా జాయిన్ అయ్యారు. కాసేపటికి కొరియా అమ్మాయి కూడా వీళ్ళతో జాయిన్ అయ్యింది
ఇందులో హీరో వరుణ్ తేజ్ కమెడియన్ సత్యతో పాటుగా దర్శకుడు మేర్లపాటి కలసి ఒక కొరియన్ అమ్మాయితో విడుదల చేసిన ఈ ప్రోమో అభిమానుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ సినిమా స్టోరీ బ్యాగ్డ్రాప్ ఏంటి అనేది ఈ ప్రోమోలో చూపించారు మేకర్స్.
వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ చిత్రం సోమవారం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ వేడుకకు చిత్రబృందంతో పాటుగా వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి, మెగా డాటర్ నిహారిక , దర్శకుడు క్రిష్ పాల్గొని చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సినిమా చిత్రీకరణలో అగ్ర భాగం కొరియా, వియాత్నంలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తో పాటుగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

