‘బుల్లెట్ సునీల్’గా రాజశేఖర్ .. ‘బైకర్’ గ్లింప్స్‌ అదిరిపోయిందిగా!

by | Feb 4, 2026 | సినిమా

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్‌ (Sharwanand) కథానాయకుడిగా డైరెక్టర్ అభిలాష్‌ రెడ్డి (Abhilash Reddy) తెరకెక్కించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘బైకర్’.(Biker) ఇందులో మాళవికా నాయర్‌ (Malavika Nayar) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ (UV Creations) బ్యాన‌ర్‌లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్ప‌లపాటి ప్ర‌మోద్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మెన్ డాక్ట‌ర్ రాజశేఖ‌ర్ (Raja Sekhar) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం బైకర్ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ బుధ‌వారం రాజ‌శేఖ‌ర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న బుల్లెట్ సునీల్ (Bullet Sunil) పాత్రను ప‌రిచ‌యం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో రిటైర్ అయిన బైక‌ర్‌గా రాజ‌శేఖ‌ర్ క‌నిపించ‌గా అనంతరం శ‌ర్వానంద్‌కు కోచ్ పాత్ర చేసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఆయనను పవర్ ఫుల్ రోల్ లో చూడబోతున్నామని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ మళ్లీ మునుపటి రాజశేఖర్ ను గుర్తు చేస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. శర్వానంద్‌ (Sharwanand) తో పాటు రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో ఇందులో నటించడం సినిమాకు అదనపు బలం అవుతుందని, ఈ మూవీ కచ్చితంగా ఘన విజయం సాధించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 3న బైకర్ (Biker) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు యూవీ క్రియేషన్స్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.