పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడుగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా(Rasi Khanna) కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. గతంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర విడుదలపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి మార్చి 27వ తేదీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే ఆ సినిమా షూటింగ్ కారణాల వలన వాయిదా పడటంతో, పెద్ది డేట్ కు ఒక రోజు ముందు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని తీసుకొచ్చారు మేకర్స్.


