‘మన శంకరవప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్‌..

by | Feb 4, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకరవప్రసాద్ గారు’. (Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మొదటి షో నుంచే సూపర్ టాక్ తో దుమ్మురేపుతూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిరంజీవి (Chiranjeevi) , నయనతారల (Nayanathara) యాక్షన్ కు తోడుగా, వెంకటేష్ (Venkatesh) కేమియో రోల్, అనిల్ రావిపూడి అదిరిపోయే డైరెక్షన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి చిరు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ అయి నాలుగు వారాలు కావ‌స్తున్నా మంచి రెస్పాన్స్‌తో థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది.

అయితే బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎప్పుడొస్తుందా అని మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు మన శంకర్ వరప్రసాద్ గారు టీమ్‌ శుభవార్త చెప్పింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5 ) వేదికగా ఫిబ్రవరి 11నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈమేరకు తాజాగా ఒక వీడియోతో జీ5 సంస్థ మన శంకరవరప్రసాద్ గారు చిత్రం త్వరలో జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఈ సినిమా ఓటీటీ వర్షన్‌లో తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్‌, మరాఠి, బెంగాలీలో మొత్తంగా 7 భాషల్లో విడుదల కానుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో చిరంజీవికి (Chiranjeevi) అభిమానులు ఉండటం వల్లే పలు భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని సాహు గారపాటి (Sahu Garapati) నిర్మించగా, సుష్మిత కొణిదెల (Sushmitha Konidela) సమర్పించారు