మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) . బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) , సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్లి, అదిరిపోయే వినోదాన్ని ఆస్వాదించేలా ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం.
ఇప్పటికే పెద్ది (Peddi) నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా హైప్ కూడా పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకోంటుంది. ఇక తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. నిజానికి పెద్ది చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఇప్పుడు దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేశారు. అయితే రణ్‌వీర్ సింగ్ నటించిన దురంధర్-2 సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ సారి దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దిని వాయిదా వేసి ఉంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ది (Peddi) విధ్వంసం అలాగే ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


