మెగా కాంబో.. వరుణ్‌ తేజ్‌ హీరోగా నిహారిక సినిమా!

by | Feb 4, 2026 | సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా, మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. రితికా నాయక్‌ (Rithika Nayak) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హారర్ కామెడీ జానర్‌లో, రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వరుణ్ తేజ్ మరో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఒకటి మెగా డాటర్ వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల (Niharika Kondela) నిర్మించనున్నారని తెలిసింది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం. వరుణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రెండు సినిమాల్లో ఒక చిత్రాన్ని అట్లీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బాలాజీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ ఏడాదిలోనే మొదలుకానుంది. ఇక నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో సూపర్ సక్సెస్‌ అందుకున్న నిహారిక కొణిదెల ఈ సినిమాతో పలు విభాగాలలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను దక్కించుకున్నారు. అదే ఉత్సాహంతో సంగీత్ శోభన్ తో ‘రాకాస’ చిత్రాన్ని నిహారిక నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఇక ఇండస్ట్రీకి మొదట్లో యాంక‌ర్‌గా ప‌రిచ‌య‌మైన నిహారిక కొణిదెల (Niharika Konidela) ఆ త‌ర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మ‌న‌సు చిత్రంతో కథానాయికగా మారిన నిహారిక ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయగా, ఏ ఒక్కటీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేక‌పోయింది. దీంతో నిహారిక హీరోయిన్ గా కాకుండా నిర్మాణ రంగం వైపు వేసి సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలిచారు. మంచి కంటెంట్‌తో , తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ సాధిస్తున్నారు.