పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) కథానాయికగా నటిస్తుంది. రాశీఖన్నా (Rashi Khanna) కీలక పాత్రలో అలరించనుంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందులోని ప్రతి సాంగ్ అదరగొట్టింది. ముఖ్యంగా కెవ్వు కేక అనే స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కెవ్వు కేక లాంటి మరో స్పెషల్ సాంగ్ ఉంటుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఉస్తాద్ లో అసలు స్పెషల్ సాంగ్ లేదు అని దర్శకుడు హరీశ్ శంకర్ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఖుషీ నుంచి ఓజీ వరకు ప్రతి సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ తో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. గతేడాది వచ్చిన ఓజీలో కూడా రాధిక నేహా శెట్టి స్పెషల్ సాంగ్ చేసింది. అలాంటిది ఉస్తాద్ లో స్పెషల్ సాంగ్ లేదు అని తెలియడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

