మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’.(Peddi) బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jahnavi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchababi Sana). అయితే ఈ మూవీ ఫైనల్ అవుట్ పుట్ విషయంలో దర్శకుడు సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడుగా సుకుమార్ (Sukumar) తెలుగు రాష్ట్రాలకే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కల్ట్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు పొందారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన శిష్యుడు బుచ్చిబాబు సాన కోసం సుకుమార్ దగ్గరుండి మరీ ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ సారథ్యంలో పెద్ది సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ కు సంబంధించిన అంశాలపై సలహాలు ఇస్తున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రానికి పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నాయి. ఇలా దగ్గరుండి తన శిష్యుడు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి సుకుమార్ సహకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఈ చిత్రాన్ని రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు కానుకగా మార్చి 27 న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

