టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే విడుదలై 6 రోజులు దాటినా ‘తండేల్’ ఇంకా జోరు కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తండేల్ సినిమా 6 రోజుల థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.86 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వాలెంటైన్స్ డేతో పాటుగా వీకెండ్ కూడా కలిసి రానుండటంతో ఈ కలెక్షన్ల సునామీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ ముగిసే నాటికి ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక నాగ చైతన్య కెరీర్‌లో ‘తండేల్’ సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. ఇక మరోవైపు ‘తండేల్’ మూవీ ఓ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ఆన్‌లైన్ మూవీ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో తండేల్ చిత్రానికి ఏకంగా 1 మిలియన్ టికెట్లు బుక్ అయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు.

