గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్, యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం RC16 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు హై బడ్జెట్‌తో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
కాగా, గేమ్ ఛేంజర్ మిశ్రమ ఫలితం కారణంగా RC16 సినిమాను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా వుండగా RC16 మూవీ పట్టాలపై ఉండగానే రామ్‌చరణ్ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది. రెండేళ్ల కిందట నాని, మృణాల్ ఠాకూర్ జంటగా రొమాంటిక్ ఫ్యామిలీడ్రామాగా వచ్చిన ‘హాయ్ నాన్న’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెరకెక్కించిన దర్శకుడు శౌర్యువ్ కూడా డైరెక్టర్ గా మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే దర్శకుడు శౌర్యువ్ ఇటీవల రామ్‌చరణ్‌కు ఓ కథని వినిపించారని తెలిసింది. స్క్రిప్ట్ తో పాటుగా దర్శకుడు తన పాత్రను డిజైన్ చేసిన తీరుకు ముగ్దుడైన రామ్‌చరణ్ వెంటనే ఈ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందంటున్నారు. ఏదేమైనా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఖచ్చితంగా క్రేజీగానే ఉంటుందని చెప్పొచ్చు.

