లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి.
ముందు 150 మేకలతో ప్రారంభమై, చివరకు, అనుకోకుండా 11 మేకలే మిగిలాయి అని పృథ్వి చేసిన కామెంట్ లు నేరుగా వైస్సార్సీపీ నాయకుల, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయి. వైస్సార్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా లో బాయ్ కాట్ లైలా అనే హాష్ టాగ్ ను వైరల్ చేశారు.
ఆ తర్వాత లైలా హీరో విశ్వక్ సేన్, నిర్మాత గారపాటి సాహు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. విశ్వక్ సేన్ సినిమా ని చంపకండి అని ప్రాధేయపడ్డాడు. పృద్వి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, వాటికి సినిమాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో రాజకీయాలకు సంబంధించిన సంభాషణలు ఏమి లేవని అన్నారు
ఆ తర్వాత ఒత్తిడికి గురైన పృథ్వి ఆస్పత్రిలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది.
లైలా సినిమా రేపు విడుదలవుతుండాగా, నటుడు పృథ్వి క్షమాపణలు చెపుతూ ఒక వీడియో వదిలాడు. చేతి కి బ్యాండ్ ఎయిడ్ తోనే వీడియో చేశాడు
మేము గోదావరి జిల్లా వాళ్ళం కాబట్టి మాకు కొంత వెటకారం ఎక్కువ అంటూ వీడియో స్టార్ట్ చేశాడు
వ్యక్తిగతం గా నాకు ఎవరిమీద ఎలాంటి కోపం లేదు. నా వల్ల లైలా సినిమా ఇబ్బంది పడకూడదు అన్న ధృడ సంకల్పంతో, నా మాటలకు ఎవరి మనోభావాలైన దెబ్బతింటే సారీ అని నటుడు పృథ్వి అన్నారు. వివాదాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదాం అని అన్నాడు. బాయ్ కాట్ లైలా కాకుండా వెల్ కమ్ లైలా అనమని చెప్పాడు.
అంతే కాకుండా ఒక వ్యక్తి నా గురించి, మా అమ్మ గురించి నీచంగా మాట్లాడాడు. దాని వలన నా ఆరోగ్యం కూడా పాడైంది. అతని గురించి నేను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను అని అన్నారు. విశ్వక్ సేన్ కు, లైలా సినిమా ఫలక్ నామా దాస్ కు మించిన హిట్ అవుతుందని ఆశిస్తున్నాని అన్నాడు
షైన్ స్క్రీన్ పతాకంపై, సాహు గారపాటి నిర్మించిన లైలా సినిమా కు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు

