T20 World Cup :జింబాబ్వే పై హెట్మేయెర్, పావెల్ ల విధ్వంసం  

by | Feb 23, 2026 | క్రీడలు

జింబాబ్వే, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరుగుతోన్న సూపర్ 8 మ్యాచ్ లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్ట్ ఇండీస్ జట్టు 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఓపెనర్లు బ్రెండన్ కింగ్ 9 పరుగులు, కెప్టెన్ హోప్ 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన షిమ్రాన్ హెట్మేయెర్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు.  హెట్మేయెర్ కు తోడుగా రోవ్ మన్ పావెల్ కూడా జత కలిశాడు.  వీరిద్దరూ కలిసి మూడవ వికెట్ కు 122 పరుగులు జోడించారు.

ట్మేయెర్ ఇచ్చిన క్యాచ్ లను జింబాబ్వే ఆటగాళ్లు రెండు సార్లు నేలపాలు చేశారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ట్మేయెర్ 34 బంతుల్లో 85 పరుగులు (7 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి క్రెమెర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

35 బంతుల్లో 59 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసిన పావెల్ అవుట్ అయిన తరవాత, వికెట్లు పడుతున్న వెస్ట్ ఇండీస్ ఆటగాళ్ల విధ్వంసం ఆగలేదు.  రూథర్ ఫోర్డ్ 13 బంతుల్లో 31 పరుగులు, షెఫర్డ్ 10 బంతుల్లో 21 పరుగులు, హోల్డర్ 4 బంతుల్లో 13 పరుగులు చేశారు.

జింబాబ్వే బౌలర్లలో ఎంగర్వ ముజార్బాని చెరో రెండు వికెట్లు తీసుకోగా, ఎవాన్స్, క్రెమెర్ లు చెరో ఒక వికెట్ తీసుకున్నారు

వెస్ట్ ఇండీస్ చేసిన 254 పరుగులు T20 World Cup లో రెండవ అత్యధిక స్కోర్. గతంలో అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక, కెన్యా పై చేసిన 260 పరుగులు కాగా, వెస్ట్ ఇండీస్ ఆ రికార్డు కు చేరువగా వచ్చింది