నాని కోసం సుజిత్ స‌రికొత్త స్కెచ్.. గ్లామ‌ర్ డాల్‌ని దింపుతున్నాడుగా!

by | Feb 23, 2026 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యార‌డైజ్ (The Paradise) ‘ సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ త‌ర్వాత ఓజీ డైరెక్ట‌ర్ సుజిత్ (Sujith) ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. భారీ వ్యయంతో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ (SCU)లో భాగంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఆసక్తికరమైన కాంబినేషన్ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో నానికి జోడీగా బాలీవుడ్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరువ‌బోతున్నార‌ని ఓ క్రేజీ గాసిప్ మూవీ ల‌వ‌ర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.

ఇప్ప‌టికే హీరోయిన్ త్రిప్తి డిమ్రీతో డిస్క‌షన్స్ పూర్త‌య్యాయ‌ని.. మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డమే త‌రువాయి అని నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. నాని-సుజిత్ సినిమా గతేడాది గ్రాండ్‌గా లాంచ్ అయిన విష‌యం తెలిసిందే. నానితో చేయ‌బోయే ఈ చిత్రం ఓజీని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడ‌ట సుజిత్‌. నానిని ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని విధంగా సరికొత్త అవ‌తార్‌లో చూపించాలాని సుజిత్ గ‌ట్టిగా ఫిక్స‌యిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్క‌బోతున్న‌ పాన్ ఇండియా చిత్రం స్పిరిట్‌ (Spirit) లో కథానాయికగా త్రిప్తి డిమ్రీ ఎంపికైన విషయం తెలిసిందే. ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ‌ ఇప్పుడు సుజిత్ – నాని కాంబోలో నటించే అవకాశం దక్కించుకున్నారు.