తమిళ్ అగ్ర కథానాయకుడు సూర్య (Surya) ప్రస్తుతం వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘సూర్య 46’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రేమలు మూవీ ఫేం మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం విడుదల తేదీపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.. సూర్య (Surya) నటిస్తున్న మరో సినిమా ‘కరుప్పు’ విడుదలైన మూడు నెలల తర్వాతే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని స్పష్టం చేశారు మేకర్స్. ‘కరుప్పు’ సినిమా ఈ ఏప్రిల్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలోని ఈ సినిమా జూలైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ‘Suriya46’ గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ (Viswanadhan & Sons) అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి క్రేజీ టైటిళ్లతో అందరికీ చేరువైన దర్శకుడు వెంకీ అట్లూరి. ఈసారి కూడా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా టైటిల్ ను ఖాయం చేసినట్లు తెలుస్తోంది.

