కేసీఆర్ మాస్టర్ ప్లాన్: మౌనమే మంత్రం.. సింపతీనే ఓటుబ్యాంక్!

by | Feb 23, 2026 | రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఒక హాట్ టాపిక్కే! నిన్నటి దాకా ఒక లెక్క.. నేటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా మారుతున్నాయి ఇక్కడి ఈక్వేషన్స్. ఓడిపోయినా.. గెలిచినా.. తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు ఆయనే. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) . ఒకప్పుడు ఆయన మాట్లాడితే సంచలనం.. ఇప్పుడు ఆయన మౌనమే ఒక మహా సంచలనం! అవును.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఇప్పుడు ఆయనకు శ్రీరామ రక్షగా మారుతోందా? కడియం శ్రీహరి (Kadiyam Sri Hari) లాంటి నేతలు చేస్తున్న విమర్శలు కేసీఆర్ కు సింపతీ ఓట్లు తెచ్చిపెట్టబోతున్నాయా? లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద మ్యాటర్. ముందుగా మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుందాం. రెండు రోజుల క్రితం ఆయన చేసిన జాతిపిత వ్యాఖ్యలు, తెలంగాణ సెంటిమెంట్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ ప్రజల నరనరాన జీర్ణించుకుపోయింది. దాన్ని టచ్ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కడియానికి తెలియనిది కాదు. కానీ ఎందుకో ఆయన నోరు జారారు.. ఇప్పుడదే బీఆర్ఎస్ (BRS) కు ప్లస్ పాయింట్ గా మారుతోంది.

ఇక కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు. ప్రత్యర్థులు తనను ఎంతగా విమర్శిస్తున్నా, కడియం లాంటి వాళ్ళు టార్గెట్ చేస్తున్నా.. కేసీఆర్ సైలెంట్ గా ఉండిపోయారు. ఈ మౌనమే ఇప్పుడు ఒక పవర్ ఫుల్ వెపన్. ఆయన సైలెంట్ గా ఉన్నకొద్దీ ప్రజల్లో సింపతీ పెరుగుతోంది. విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోవడం ద్వారా, తన స్థాయిని కేసీఆర్ పెంచుకుంటున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఈ మౌనమే ఎన్నో సీట్లు తెచ్చిపెడుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా.. ఈ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతారు. రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ.. కేసీఆర్ చేసిన ప్రాణత్యాగ దీక్ష, ఆయన నడిపిన దశాబ్దాల ఉద్యమం వల్లే ఈ కల సాకారమైందని జనం విశ్వసిస్తారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారన్న కోపం ప్రజల్లో ఉంది కాబట్టే గత ఎన్నికల్లో ఓడించారు.. కానీ ఆయన చేసిన త్యాగాలను పూర్తిగా మర్చిపోయేంత కోపం తెలంగాణ ప్రజలకు లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కడియం శ్రీహరిని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. టీడీపీ నుంచి వచ్చిన కడియం శ్రీహరిని ఎంపీని చేసింది ఎవరు? ఆ తర్వాత రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, ఆ పెద్ద పీట కడియానికి వేసింది ఎవరు? అంతటి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన కేసీఆర్ పైనే ఇప్పుడు కడియం శ్రీహరి ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని సోషల్ మీడియాలో యువత నిలదీస్తోంది. ఎక్కడ అధికారం ఉంటే అటు వెళ్లే నాయకుడిగా కడియంపై ముద్ర పడిపోయిందని, రేపు పొరపాటున కాంగ్రెస్ అధికారం కోల్పోతే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి ఆయన వెనుకాడరని సెటైర్లు పేలుతున్నాయి. “మొత్తం మీద చూసుకుంటే, కడియం శ్రీహరి లాంటి నేతలు కేసీఆర్ పై విమర్శలు చేసేముందు, కేసీఆర్ ట్రాక్ రికార్డ్ ను, ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుంటే మంచిదన్న హితవు రాజకీయ పండితుల నుంచి వినిపిస్తోంది. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని కేసీఆర్ తన మౌనంతో స్పష్టం చేస్తున్నారు. ఈ సైలెంట్ వేవ్ ఏ స్థాయి సునామీని సృష్టిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి.