అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ కథానాయకుల్లో ఒకరు. అయితే తాజాగా గోవాలో జరిగిన ‘ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్’ (Indian Racing Festival) లో నాగచైతన్య సందడి చేశారు. రౌండ్-4లో భాగంగా తన సొంత మోటార్ స్పోర్ట్స్ జట్టు ‘హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్’కు సపోర్ట్ గా గోవా స్ట్రీట్ సర్క్యూట్ లో చైతూ పాల్గోన్నారు. దేశంలో యువ రేసర్లను ప్రోత్సహించడంతో పాటు రేసింగ్ అభివృద్ధిలో భాగంగా తాను లీగ్‌లో భాగమైనట్లు నాగచైతన్య తెలిపాడు. ఇక ఫ్రాంచైజీ యజమానిగా నాగ చైతన్య, ట్రాక్‌పై హైస్పీడ్ యాక్షన్ మధ్య డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే..గత ఏడాది ‘తండేల్’ సినిమాతో తొలిసారి వందకోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యారు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం ఆయన ఫాంటసీ థ్రిల్లర్ ‘వృషకర్మ’(Vrusha Karma) లో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత చైతూ సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు తరుణ్‌భాస్కర్‌తో చైతూ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ‘ఈ నగరానికి ఏమైంది-2’ సినిమాను పట్టాలెక్కించేందుకు తరుణ్ భాస్కర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.


