‘AA22 x A6’ ట్రీట్‌కు డేట్ ఫిక్స్.. బన్నీ ఫ్యాన్స్​కు పండగే!

by | Feb 23, 2026 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడుగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటీనటుల విషయానికి వస్తే, అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) నటిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ వ్యయంతో సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ‘AA22 x A6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని సరికొత్త సాంకేతికతను ఈ సినిమా కోసం వాడుతున్నారు. ఈ మూవీ చిత్రీకరణలో సగ భాగం ఇప్పటికే పూర్తవగా.. తదుపరి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్బంగా ఈ సినిమా నుండి మేక‌ర్స్ టైటిల్ తో పాటుగా గ్లింప్స్ (Title and Glimpse) విడుదల చేయాలని నిర్ణయించింది.

ఈ గ్లింప్స్ ద్వారా సినిమా కథతో పాటుగా జోనర్‌ రివీల్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ విష‌యం తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా దీనిపై చిత్ర‌యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపికాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పేర్లు వినిపించగా తాజాగా రష్మిక మందన ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రష్మిక (Rashmika Mandana) నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు.