T20 World Cup – Super 8 : పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. సూపర్ 8 లో ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచిన ఇంగ్లాండ్ జట్టు సెమి ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది.
165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు కు మొదటి ఓవర్లోనే షాక్ ఇచ్చింది పాకిస్థాన్. ఓపెనర్ ఫీల్ సాల్ట్ ఆడిన మొదటి బంతికే డక్ అవుట్ అయ్యాడు. ఫామ్ లో లేక సతమవుతున్న బట్లర్ మరో సారి రెండు పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన బెథెల్ 8 పరుగులు, బాంటన్ 2 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు
58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టును కెప్టెన్ బ్రూక్ ఆదుకున్నాడు. బ్రూక్ బాధ్యతాయుతంగా ఆడుతూ, మరో వైపు ధాటిగా ఆడుతూ కావలసిన రన్ రేట్ కంట్రోల్ లో ఉంచుతూ ఆడాడు. సామ్ కరణ్, బ్రూక్స్ ఐదవ వికెట్ కు 45 పరుగులు జోడించారు
సామ్ కరణ్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాక, బ్రూక్ తో జత కలిసిన విల్ జాక్స్ ఆరవ వికెట్ కు 52 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే బ్రూక్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రూక్స్ 51 బంతుల్లో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బ్రూక్ ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. T20 World Cup లో సెంచరీ చేసిన మొదటి కెప్టెన్ గా బ్రూక్ రికార్డు సృష్టించాడు బ్రూక్స్ అవుట్ అయిన కాసేపటికే 28 పరుగులు చేసిన జాక్స్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తరవాత ఓవర్టన్ డక్ అవుట్ అవడంతో కొంత డ్రామా నెలకొంది.
ఆఖరి ఓవర్ లో మూడు పరుగులు చేయాల్సిన దశలో ఆర్చర్ మొదటి బంతికి బంతిని బౌండరీకి తరలించి మ్యాచ్ ను ముగించాడు. ఇంగ్లాండ్ జట్టు 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది
పాకిస్థాన్ బౌలర్లలో ఫామ్ లోకి వచ్చిన షహీన్ ఆఫ్రిది నాలుగు వికెట్లు తీసుకోగా, ఉస్మాన్ తారిఖ్, మొహమ్మద్ నవాజ్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
45 బంతుల్లో 63 పరుగులు చేసిన ఓపెనర్ ఫర్హాన్ పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. బాబర్ అజాం 25 పరుగులు, ఫకర్ జమాన్ 25 పరుగులు, షాదాబ్ ఖాన్ 23 పరుగులు చేశారు. పాకిస్థాన్ చివరి 42 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది
ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ డాసన్ మూడు వికెట్లు తీయగా, ఆర్చర్, ఓవర్టన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఒక వికెట్ తీసుకున్నాడు
సూపర్ 8 లో పాకిస్థాన్ జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ లభించింది.


