మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ (Uppena) ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) . బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో, వృద్ధి సినిమాస్ (Vruddhi Cinemas) పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అత్యంత వేగంగా నడుస్తున్నాయి. ఇక ‘పెద్ది’ (Peddi) సినిమా 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా రెండు నెలలు టైమ్ ఉండగానే ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. విడుదలైన తొలి రోజే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ సాంగ్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి 2న సెకండ్ సింగిల్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది హీరో రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్ అని సమాచారం. రూరల్ బ్యాగ్డ్రాప్, ఏమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ల మేళవింపుతో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

