ఇంగ్లాండ్ ను 146 పరుగులకే కట్టడి చేసిన లంక బౌలర్లు

by | Feb 22, 2026 | క్రీడలు

T20 World Cup – Super 8 : శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీ లంక ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్ల లో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. 

ఫామ్ లేని బట్లర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఆ తరవాత వచ్చిన బెథెల్ 3 పరుగులు, బాంటన్ 6 పరుగులు చేసిన వెంట వెంటనే అవుట్ అవడంతో 49 పరుగులకే మూడు వికెట్ లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాలో పడింది

అయితే కెప్టెన్ హరీ బ్రూక్ వచ్చిన వచ్చిన తరవాత క్రీజ్ లో కుదురుకుంటున్నాడనుకునే లోపు 14 పరుగులు చేసిన బ్రూక్ అవుట్ అయ్యాడు.  కాసేపటికే సామ్ కరన్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఓపెనర్ వచ్చిన ఫిల్  సాల్ట్ 40 బంతుల్లో 62 పరుగులు చేసి భారీ షాట్ కోసం ప్రయత్నించి ఆరవ వికెట్ గా వెను తిరిగాడు. ఆఖర్లో విల్ జాక్స్ నాలుగు బౌండరీలతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

శ్రీలంక బౌలర్ల లో స్పిన్నర్ వెల్లగే మూడు వికెట్లు తీయగా, తీక్షణ, మధుశనక లు చెరో  రెండు వికెట్ లు తీయగా,  చమీర కు ఒక వికెట్ దక్కింది

శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవడం లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. గ్రూప్ స్టేజి లో ఇంగ్లాండ్ గెలిచిన మూడు మ్యాచ్ లు చిన్న జట్ల మీద గెలిచినవే.  వెస్ట్ ఇండీస్ చేతిలో ఓడిపోయింది. టి 20 క్రికెట్ లో ఇంత తక్కువ టార్గెట్ ను కాపాడుకోవడం అంత సులభం కాదు