T20 World Cup : ఆఫ్ఘానిస్తాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం

by | Feb 8, 2026 | క్రీడలు

T20 World Cup లో భాగంగా ఆఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ (Afghanisthaan) 20 ఓవర్ల లో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

ఆఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు గుర్బాజ్ 27 పరుగులు, జర్దాన్ 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  అయితే  గులాబదిన్ నయిబ్ హైలైట్ అని చెప్పవచ్చు.  గులాబదిన్ నయిబ్ కేవలం 35 బంతుల్లో 63 పరుగులు చేశాడు.  అతని ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. అంతే కాకుండా మూడవ వికెట్ కు సెదిక్కుల్లా అటల్ తో కలిసి 79 పరుగులు జోడించాడు

ఆ తరవాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.  అయితే రసూలి 13 బంతుల్లో 20 పరుగులు, ఒమర్జాయి 7 బంతుల్లో 14 పరుగులు, నబి 7 బంతుల్లో 10 పరుగులు చేయడంతో ఆఫ్ఘానిస్తాన్ న్యూజిలాండ్ కు పోరాడగలిగే టార్గెట్ ఇచ్చింది

న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గుసన్ రెండు వికెట్లు తీయగా, హెన్రీ, డఫీ, రచిన్ రవీంద్ర లు తలా ఒక వికెట్ తీశారు.

183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ అలెన్ ఒక్క పరుగుకే అవుట్ అవడం, వన్ డౌన్ లో వచ్చిన రచిన్ రవీంద్ర డక్ అవుట్ అవడంతో 14 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ పీకల లోతు కష్టాల్లో పడింది

అయితే మరో ఓపెనర్ సీఫెర్ట్, ఫిలిప్స్ లు ధాటిగా ఆడుతూ మూడవ వికెట్ కు 74 పరుగులు జోడించారు.  ఫిలిప్స్ 25 బంతుల్లో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  ఆ తరవాత చాప్ మన్ తో కలిసిన  సీఫెర్ట్ నాలుగవ వికెట్ కు 36 పరుగులు జోడించారు.  42 బంతుల్లో 65 పరుగులు చేసిన   సీఫెర్ట్ అవుట్ అయినా  చాప్ మన్ (17 బంతుల్లో 28 పరుగులు),   మిచెల్ ( 14 బంతుల్లో 25 పరుగులు), కెప్టెన్ సాంట్నర్  ( 8 బంతుల్లో 17 పరుగులు) చేయడంతో న్యూజిలాండ్ 183 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్ల లోనే  ఛేదించింది

మంచి అవకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చేజార్చుకున్నారని చెప్పవచ్చు.  ఎంతైనా అనుభవమైన ఆటగాళ్లతో ఆడితే మ్యాచ్ స్వరూపం ఎప్పుడైనా మారవచ్చు

ఆఫ్ఘానిస్తాన్ బౌలర్లలో రెహమాన్ రెండు వికెట్లు తీసుకోగా, ఒమార్జాయి, రషీద్ ఖాన్, నబి లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.