‘పుష్ప’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. AA22xA6 (AA22 x A6) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ (Sun Pictures)సంస్థ తెరకెక్కించనుంది. ఈ మూవీ తర్వాత మరో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ ఈ రెండింటికి మించి మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన అగ్ర దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఒకరని చెప్పవచ్చు. కథను కేవలం చెప్పడమే కాదు, దాన్ని అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చడంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘హమ్ దిల్ చుకే సనమ్’, ‘దేవదాస్’, ‘బ్లాక్’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఆయన, ఇపుడు అల్లు అర్జున్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇక పుష్పతో నార్త్ ఆడియన్స్‌కు అల్లు అర్జున్ ఇప్పటికే దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా బన్సాలీ అదిరిపోయే సబ్జెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ (Lokesh Kanaka Raj( సినిమా లైనప్ లో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాతే భన్సాలీతో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

