Surya, Venki మూవీ – క్రేజీ టైటిల్‌తో థియేటర్లలోకి!

by | Feb 1, 2026 | సినిమా

కోలీవుడ్ అగ్ర హీరో సూర్య (Surya) తెలుగు సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘సూర్య 46’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇందులో ప్రేమలు మూవీ ఫేం మమితా బైజు కథానాయికగా న‌టిస్తుండగా.. సీనియర్ నటీమణులు రాధికా శరత్‌ కుమార్‌ (Radhika Sharath Kumar), రవీనా టాండన్ (Ravina Tandon) కీలక పాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి క్రేజీ టైటిళ్లతో అందరికీ చేరువైన డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈసారి కూడా అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యేలా టైటిల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో అందరికీ చేరువయ్యేలా పాన్ ఇండియా లెవెల్లో ‘విశ్వనాధం అండ్ సన్స్’ (Viswanadham & Sons) అనే టైటిల్‌ను మేకర్స్ దాదాపు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇది తెలుగులో ‘విశ్వనాథం అండ్ సన్స్’గా ఉండనుండగా, తమిళంలో ‘విశ్వనాధన్ అండ్ సన్స్’ అని, కన్నడలో ‘విశ్వనాధ అండ్ సన్స్’ అని ఉండనుంది. కాగా, ఈ మూవీని జులై 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయమంటున్నారు మేకర్స్.