టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) . గతేడాది ‘కింగ్డమ్’తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన ఈ ఏడాది రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ఇందులో రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana) సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కోనసీమ నేపథ్యంలో సాగే రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు (Dil Raju), శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫుల్ వయొలెంట్‌గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన (Sobhana) కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సన్నివేశాల్లో ఆమె విజయ్ తల్లి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఇక ఈ సీనియర్ హీరో రాజశేఖర్ (Raja Sekhar) కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ చూడని సరికొత్త పాత్రలో రాజశేఖర్ కనిపించనున్నారట. ఈ క్యారెక్టర్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. కాగా, ‘రాజావారు రాణిగారు’ సినిమాతో అందర్నీ తనవైపు తిప్పుకున్న దర్శకుడు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) ఈ రెండో సినిమాను కూడా అద్భుతంగా తీస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

