తల్లి తండ్రుల బాధ్యత, పిల్లలదే – సుప్రీమ్ కోర్ట్

by | Jan 4, 2025 | వార్తలు

జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసిన తల్లి తండ్రుల బాధ్యత పిల్లలదేనని (కొడుకైన కూతురైన) సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.  తల్లి తండ్రుల బాధ్యతను విస్మరిస్తే, ఆస్తి హక్కు రద్దు అవుతుందని సుప్రీమ్ కోర్ట్ హెచ్చరించింది

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో, కొంత ఆస్తి తీసుకున్నాక తల్లి తండ్రులను విస్మరించిన కొడుకు కు సంబంధించిన కేసులో  సుప్రీమ్ కోర్ట్ ఈ విషయం స్పష్టం చేసింది.  ఇంతకు ముందు కొడుకు కు ఇచ్చిన అస్తి మీద, తిరిగి తల్లి తండ్రులకు యాజమాన్య హక్కులు వచ్చేలా తీర్పు ఇచ్చింది

పిల్లల నిరాదరణకు గురయ్యే ప్రతి తల్లి తండ్రులకు , వృద్దులకు,  2007 లో ప్రభుత్వం  తీసుకు వచ్చిన  ‘తల్లి తండ్రుల,  వృద్ధుల సంరక్షణ, పోషణ’ చట్టం అండ దండలు ఉంటాయి.  ఒక వేళ, తల్లి తండ్రులు ఆస్థి మొత్తం పిల్లకు రాసిచ్చిన తరవాత, పిల్లలు సరిగా చూసుకోకపోతే, తిరిగి పిల్లలనుండి ఆ ఆస్థి పొందేలా చట్టాలున్నాయి.  ఇలాంటి కేసులలో తీర్పు కూడా వెంటనే ఇస్తారు.

తల్లి తండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రతి ఒక్కరికి ఈ కేసు ఒక గుణపాఠం కావాలి.  తల్లి తండ్రులు కూడా మీరు బ్రతికి ఉండగా మీ ఆస్తులను ఎవరికీ రాసి ఇవ్వకండి (మీ పిల్లలకైనా).  మీ తదనంతరం మాత్రమే వారికి ఆస్తి, సంక్రమించేలా వీలునామా వ్రాయండి.

అయినా ఆస్తితో సంబంధం లేకుండా, మిమ్మల్ని కనీ, పెంచి, పోషించి, పెద్ద చేసిన మీ తల్లి తండ్రులను ప్రేమగా, బాధ్యతతో చూసుకోవడం మీ కనీస బాధ్యత.  ఇటువంటి విషయాలకు కోర్ట్ మెట్లు ఎక్కి, కోర్ట్ సమయాన్ని వృధా చేయకండి.

మీరు, మీ తల్లి తండ్రులను,  సరిగ్గా చూసుకోకపోతే, మీ పిల్లలు ,మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. తల్లి తండ్రుల పట్ల, సమాజం పట్ల, బాధ్యతతో వ్యవహరించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత