గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రి దగ్గర వేమగిరి లో జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు ముఖ్య అతిధిగా రాబోతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, ఈ ప్రీ రిలీజ్ ఈవెన్ కి వస్తారా లేదా వీడియో సందేశం ఏమైనా పంపిస్తారా అనే విషయం తెలియాల్సి వుంది
గేమ్ చేంజర్ సినిమా పై భారీ గా అంచనాలు ఉన్నాయ్. ట్రైలర్ చూస్తే అంచనాలను అందుకునేలా లేవు.
గేమ్ చేంజర్ సినిమా ఇండియన్ 2 తరవాత వస్తోన్న శంకర్ సినిమా. ఇండియన్ 2 దారుణ పరాజయం చవి చూసింది. 5 ఏళ్ళ తరవారత, రామ్ చరణ్ సోలో హీరో గా వస్తోన్న సినిమా. దిల్ రాజు కి ఇది 50 వ సినిమా, అంతే కాకుండా మొదటి పాన్ ఇండియా సినిమా.
ఏ రకం గా చూసిన, గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్,శంకర్, దిల్ రాజు లకు ప్రత్యేకం. ఈ సినిమా విజయం సాధించడం కూడా చాలా అవసరం.


