భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న వెబ్ స్టర్ 57 పరుగులతో రాణించాడు.
కెప్టెన్, మెయిన్ బౌలర్ బుమ్రా మైదానంలో ఎక్కువసేపు లేకపోయినా, భారత జట్టు పేస్ బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ వచ్చింది.
భారత జట్టు బౌలర్లలో ప్రసిద్ద కృష్ణ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీయగా, బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు.
భారత జట్టు నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. సిరీస్ సమం చేయడానికి భారత జట్టుకు ఇది ఒక గొప్ప అవకాశం

