శివాలెత్తిన రిషబ్ పంత్

by | Jan 4, 2025 | Uncategorized

భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ లో ప్రారంభమైన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం మనకు తెలిసిందే.  ఆస్ట్రేలియా కూడా తన మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే కుప్ప కూలింది.

అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. 

జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, కోహ్లీ 6, పంత్ 61, నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు

మొదటి ఓవర్లో నాలుగు బౌండరీలు బాది ఇన్నింగ్స్ ను ప్రారంభించిన జైస్వాల్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.   రిషబ్ పంత్ ఆట ఇన్నింగ్స్ కే  హైలైట్. టీ 20 తరహా ఆట ఆడిన రిషబ్ పంత్ కేవలం 33 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి  

ఆస్ట్రేలియా బౌలర్లలో బొలాండ్ నాలుగు  వికెట్లు, కమిన్స్, వెబ్ స్టర్ తలా ఒక వికెట్ తీశారు

రెండవ రోజు ఆట ముగిసే సమయానికి జడేజా 8 పరుగులతో, సుందర్ 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు

ప్రస్తుతానికి భారత జట్టు 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి