ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ప్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది
సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పరుగులకే రెండు కీలక వికెట్ లు కోల్పోయింది. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
అయితే నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ లు మూడవ వికెట్ కు 61 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 47 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరవాత 32 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి, 26 పరుగులు చేసిన క్లాసెన్ వెంట వెంటనే అవుట్ అవడంతో 128 పరుగులకే 5 వికెట్ లు కోల్పోయి, సన్ రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది
అనికేత్ వర్మ ధాటిగా ఆడుతూ 13 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేసి స్కోర్ బోర్డు ను కాసేపు పరిగెత్తించాడు. కెప్టెన్ కమ్మిన్స్ కూడా 4 బంతుల్లో 18 పరుగులు చేశాడు. 3 సిక్సర్లు కొట్టి నాలుగవ బంతికి అవుట్ అయ్యాడు
సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. వికెట్లు పడుతున్నా ధాటిగానే ఆడారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగులు తక్కువ చేసింది. ఈ పిచ్ 200 పై చిలుకు స్కోర్ చేయవచ్చు. ఆఖరి రెండు ఓవర్ల లో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో శార్దూల ఠాకూర్ నాలుగు వికెట్ లు తీయగా, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ లు తలా ఒక వికెట్ తీశారు

