సన్ రైజర్స్ హైదరాబాద్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్

by | Mar 28, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

191 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ రెండవ ఓవర్లోనే  మార్క్రమ్ వికెట్ కోల్పోయింది.  అయితే మరో ఓపెనర్ మిచెల్ మార్ష్,  వన్ డౌన్ లో వచ్చిన నికోలస్ పూరన్ లు ధాటిగా ఆడుతూ రెండవ వికెట్ కు 116 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 52 పరుగులు చేసిన మార్ష్, 26 బంతుల్లో 70 పరుగులు చేసిన పూరన్ లు వెంట వెంటనే అవుట్ అయ్యారు

ఆ తరవాత మిగతా వారందరు తల ఒక చెయ్యి వేసి లక్నో సూపర్ జెయింట్స్ ను గెలిపించారు. చివర్లో అబ్దుల్ సమద్ ధాటిగా ఆడుతూ 8 బంతుల్లో 22 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు.  మిల్లర్ 13 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.  లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవెన్లలోనే 193 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది 

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల లో కమ్మిన్స్ రెండు వికెట్లు తీయగా, షమీ,జంపా, హర్షల్ పటేల్ లు తల ఒక వికెట్ తీశారు

4 వికెట్లు తీసిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ శార్దూల ఠాకూర్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

అంతకు ముందు టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ప్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది

సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పరుగులకే రెండు కీలక వికెట్ లు కోల్పోయింది. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు.  అభిషేక్ శర్మ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

అయితే నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ లు మూడవ వికెట్ కు 61 పరుగులు జోడించారు.  28 బంతుల్లో 47 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను ప్రిన్స్ యాదవ్ బౌల్డ్ అయ్యాడు.  ఆ తరవాత 32 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి, 26 పరుగులు చేసిన క్లాసెన్ వెంట వెంటనే అవుట్ అవడంతో 128 పరుగులకే 5 వికెట్ లు కోల్పోయి, సన్ రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది 

అనికేత్ వర్మ ధాటిగా ఆడుతూ 13 బంతుల్లో 5 సిక్సర్ల సాయంతో 36 పరుగులు చేసి స్కోర్ బోర్డు ను కాసేపు పరిగెత్తించాడు.  కెప్టెన్ కమ్మిన్స్ కూడా 4 బంతుల్లో 18 పరుగులు చేశాడు.  3 సిక్సర్లు కొట్టి నాలుగవ బంతికి అవుట్ అయ్యాడు

సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి.   వికెట్లు పడుతున్నా ధాటిగానే ఆడారు.  అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగులు తక్కువ చేసింది.  ఈ పిచ్ 200 పై చిలుకు స్కోర్ చేయవచ్చు. ఆఖరి రెండు ఓవర్ల లో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో శార్దూల ఠాకూర్ నాలుగు వికెట్ లు తీయగా, ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ లు తలా ఒక వికెట్ తీశారు