అల్లు అర్జున్, రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం పుష్ప 2. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిచిన ఈ సినిమా లో ఇండియా లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు పుష్ప 2 చిత్రం ఈ ఏప్రిల్ 13 న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో సాయంత్రం 5. 30 గంటలకు ప్రసారమవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు.
ఈ ఆదివారం ఏప్రిల్ 6 న పుష్ప – పార్ట్ 1 ని స్టార్ మా లో ప్రసారం చేస్తున్నారు. అంతే కాకుండా పుష్ప -2 స్పెషల్ ఇంటర్వ్యూ ని కూడా ప్రసారం చేస్తున్నారు. వచ్చే ఆదివారం అంటే ఏప్రిల్ 13 న పుష్ప 2 ప్రీమియర్ చేస్తున్నారు
థియేటర్లలో బాక్స్ ఆఫీస్ రికార్డు లు బద్దలు కొట్టిన పుష్ప 2 టెలివిజన్ లో ఎలాంటి రికార్డు లు సృష్టిస్తుందో చూడాలి.

