ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్ లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 89 పరుగులు జోడించారు.
26 బంతుల్లో 38 పరుగులు చేసి సంజు శాంసన్ అవుట్ అయ్యిన తరవాత, జట్టు స్కోర్ 123 పరుగుల వద్ద మరో ఓపెనర్ జైస్వాల్ 45 బంతుల్లో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన నితీష్ రానా కూడా 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే రియాన్ పరాగ్, హేట్మేయర్ లు నాలుగవ వికెట్ కు 47 పరుగులు జోడించారు. 20 పరుగులు చేసిన హేట్మేయర్ 19వ ఓవర్ ఐదవ బంతికి అవుట్ అయ్యాడు.
మరోవైపు రియాన్ పరాగ్ ధాటిగా ఆడుతూ 25 బంతుల్లో 43 పరుగులు చేయగా, అతనికి తోడుగా, ధృవ్ జురెల్ 5 బంతుల్లో 13 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది
పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో ఫెర్గుసన్ రెండు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ , మార్కో జాన్సెన్ లు చెరో ఒక వికెట్ తీశారు

