ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
206 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ 43 పరుగులకే నాలుగు వికెట్ లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది
ఓపెనర్ ఆర్య డక్ అవుట్ కాగా, ప్రభు సిమ్రాన్ సింగ్ 17 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులు, స్టయినిస్ 1 పరుగు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు
అయితే ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన నేహాల్ వధేరా, మాక్స్ వెల్ లు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ని పరిగెత్తించారు. మళ్ళీ పంజాబ్ కింగ్స్ విజయంపై అసలు చిగురింప చేశారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ అవుట్ అవడంతో పంజాబ్ కింగ్స్ ఓటమి ఖాయమైంది
జట్టు స్కోర్ 131 పరుగుల వద్ద వధేరా 41 బంతుల్లో 62 పరుగులు, మాక్స్ వెల్ 30 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అవడంతో పంజాబ్ కింగ్స్ తేరుకోలేకపోయింది
చివరకు 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి లక్ష్యానికి 50 పరుగుల దూరంలో ఆగిపోయింది
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ లలో ఈ సీజన్లో మొదటి సారి మెరుగైన బౌలింగ్ చేసిన జోఫ్రా ఆర్చర్ మూడు కీలక వికెట్లు తీశాడు. ఇంకా సందీప్ శర్మ, తీక్షణ రెండేసి వికెట్లు తీయగా, కార్తికేయ,హాసరంగాలు చెరో ఒక వికెట్ తీశారు
జోఫ్రా ఆర్చర్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది
అంతకు ముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్ లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 89 పరుగులు జోడించారు.
26 బంతుల్లో 38 పరుగులు చేసి సంజు శాంసన్ అవుట్ అయ్యిన తరవాత, జట్టు స్కోర్ 123 పరుగుల వద్ద మరో ఓపెనర్ జైస్వాల్ 45 బంతుల్లో 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన నితీష్ రానా కూడా 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే రియాన్ పరాగ్, హేట్మేయర్ లు నాలుగవ వికెట్ కు 47 పరుగులు జోడించారు. 20 పరుగులు చేసిన హేట్మేయర్ 19వ ఓవర్ ఐదవ బంతికి అవుట్ అయ్యాడు.
మరోవైపు రియాన్ పరాగ్ ధాటిగా ఆడుతూ 25 బంతుల్లో 43 పరుగులు చేయగా, అతనికి తోడుగా, ధృవ్ జురెల్ 5 బంతుల్లో 13 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోర్ 200 పరుగులు దాటింది
పంజాబ్ కింగ్స్ బౌలర్ల లో ఫెర్గుసన్ రెండు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ , మార్కో జాన్సెన్ లు చెరో ఒక వికెట్ తీశారు

