టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జాట్’. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించగా.. ఈ విలన్ పాత్రలలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ నటించారు. రణదీప్ సరసన రెజీనా (Rejina) కసండ్రా నటించింది. అలాగే ‘జాట్’ మూవీ లోని ఫస్ట్ సింగిల్ ‘టచ్ కియా’ సాంగ్ లో ఊర్వశీ రౌతేలా చిందులేసింది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అయితే ‘జాట్’ను (Jaat) టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్ లోనూ విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 10న విడుదల కానున్న ‘జాట్’ సినిమా ప్రస్తుతానికి అయితే హిందీలో మాత్రమే విడుదల కానునున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చూసిన మేకర్స్ ప్రస్తుతం హిందీలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారట. దాంతో పాటుగా జాట్ సినిమా తెలుగు డబ్బింగ్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దింతో ఈ సినిమాను ఏప్రిల్ 10న తెలుగులో విడుదల చేయకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

